దుత్తలూరు, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 1:
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కోతపేట గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికలు గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. SMC చైర్మన్ గా పచ్చవ వెంకటరత్నం వైస్ చైర్మన్గా కాకర్ల నాగేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యులు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు అభినందనలు తెలిపారు. “పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, గతంలో అన్ని సదుపాయాలు చూశారు గనుక అవకాశం కల్పించినట్లు అందుకే మరోసారి అవకాశం ఇవ్వాలని తల్లిదండ్రుల కోరుతున్నారు ఈ అవకాశం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యుల సమన్వయంతో కృషి చేస్తాం. పాఠశాల సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం” అని నూతన SMC చైర్మన్ పచ్చావ వెంగళ రత్న పేర్కొన్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి మరింత ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


