Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అల్లూరి జిల్లాలో ‘పేదల సేవలో 2.0’ గ్రామసభలు ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అల్లూరి జిల్లాలో ‘పేదల సేవలో 2.0’ గ్రామసభలు ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • అల్లూరి జిల్లాలో ‘పేదల సేవలో 2.0’ గ్రామసభలను కలెక్టర్‌ టి.
  • నిషాంతి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గురువారం పాడేరులో ప్రారంభించారు.
  • ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామసభలు నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.

అల్లూరి జిల్లాలో ‘పేదల సేవలో 2.0’ గ్రామసభలను కలెక్టర్‌ టి. నిషాంతి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గురువారం పాడేరులో ప్రారంభించారు. ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామసభలు నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. ప్రజల ఫిర్యాదులు, ధ్రువపత్రాలు, ఇతర సమస్యలను పరిష్కరించడంతోపాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు, 3డీ ప్రింటింగ్‌ క్రాఫ్ట్స్‌ శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్‌ బొర్ర నాగరాజు, ఏపీ సీఎస్‌ చైర్మన్‌ డప్పోడి వెంకటరమణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *