Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: జాబ్‌ డ్రైవ్‌లో మహిళా కళాశాల విద్యార్థినుల ప్రతిభ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అరకు: జాబ్‌ డ్రైవ్‌లో మహిళా కళాశాల విద్యార్థినుల ప్రతిభ

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థినులు జాబ్‌ డ్రైవ్‌లో ప్రతిభ కనబరిచారు.
  • కమిషనరేట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాల మేరకు జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన డ్రైవ్‌కు 16 మంది పూర్వ విద్యార్థినులు హాజరయ్యారు.
  • వీరిలో కె.

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థినులు జాబ్‌ డ్రైవ్‌లో ప్రతిభ కనబరిచారు. కమిషనరేట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాల మేరకు జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన డ్రైవ్‌కు 16 మంది పూర్వ విద్యార్థినులు హాజరయ్యారు. వీరిలో కె. నాగశ్రీ (బీఎస్సీ కెమిస్ట్రీ), బి. శైలజ, కె. దుర్గ, కె. సౌజన్య (బీఏ పొలిటికల్‌ సైన్స్‌) ఎస్‌బీఐలో ఉద్యోగాలకు ఎంపికై, గురువారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డా. ఆర్‌. కుసుమకుమారి, అధ్యాపకులు, సిబ్బంది ఎంపికైన విద్యార్థినులను అభినందించారు. చదువుతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకుంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలు సాధించవచ్చని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *