దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామంలోని పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. MPPS ఉలవపాళ్ల మెయిన్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా కాకు లక్ష్మీ ప్రసన్న, వైస్ చైర్మన్గా గొడ్డేటి రాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే MPPS ఉలవపాళ్ల అవార్డు పాఠశాల చైర్మన్గా చెజర్ల సుబ్బరామయ్య, వైస్ చైర్మన్గా శివలింగం త్రివేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లకు స్థానిక టీడీపీ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, చల్లా రాంబాబు, కప్పల మనోజ్, మర్లపాటి శ్రీహరి తదితరులు అభినందనలు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి నూతన కమిటీలు సమష్టిగా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో గ్రామస్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

ఉలవపాళ్ల పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం