బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత స్వయంభు శ్రీ మొగిలేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అధ్యక్షతన ఎనిమిది మందితో నూతన పాలక మండలిని ఏర్పాటు చేశారు. ఛైర్మన్గా కమలానాథ్ రెడ్డి, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో సీకే లావణ్య, మండల అధ్యక్షుడు ధరణి నాయుడు, జయప్రకాశ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి పాలక మండలి సభ్యులు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.

మొగిలేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం