Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఓటు హక్కుపై కోతలు ఆపాలి.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఓటు హక్కుపై కోతలు ఆపాలి.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్: పున్నమి ప్రతినిధి,:బోగస్, డూప్లికేట్ ఓట్ల తొలగింపు పేరుతో ఒక వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ ఆరోపించారు.
  • ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లపై ఫిర్యాదులు చేసినా తిరిగి చేర్చకపోవడం, కొందరిని మృతులుగా, మరికొందరిని వలస వెళ్లినవారిగా చూపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
  • ఓటు హక్కు పరిరక్షణలో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని, వివాదాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నిర్మల్: పున్నమి ప్రతినిధి,:బోగస్, డూప్లికేట్ ఓట్ల తొలగింపు పేరుతో ఒక వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ ఆరోపించారు.
ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లపై ఫిర్యాదులు చేసినా తిరిగి చేర్చకపోవడం, కొందరిని మృతులుగా, మరికొందరిని వలస వెళ్లినవారిగా చూపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఓటు హక్కు పరిరక్షణలో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని, వివాదాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం యువత, విద్యార్థులు, పౌర సమాజం, ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా ఐక్యమై ఉద్యమించాలని సయ్యద్ హైదర్ పిలుపునిచ్చారు.
– అబ్దుల్ సాదిక్ | పున్నమి రిపోర్టర్ | నిర్మల్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *