Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

దసరా వేళ అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతర.. భారీ బందోబస్తు నడుమ కొనసాగుతున్న శోభాయాత్ర!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దసరా వేళ అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతర.. భారీ బందోబస్తు నడుమ కొనసాగుతున్న శోభాయాత్ర!

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

అక్టోబర్ 17 పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మహా అడెల్లి పోచమ్మ ఆలయ గంగనీళ్ల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ ఏటా దసరా పండగ సమయంలో ఈ గంగనీళ్ల జాతర వేడుకలును అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దశాబ్దాల కాలం నుంచి అంగరంగ వైభవంగా నడుస్తున్న ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తండోప తండాలుగా తల్లి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ జాతర ఆదివారం సాయంకాలనికి ముగుస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం అమ్మవారి ఆభరణాలతో పాటు ఆయుధాలను దిలావర్పూర్ మండలంలోని న్యూ సాంగ్వి గ్రామం వద్ద ప్రత్యేక పూజలు చేసి గోదావరి జలాలతో శుద్ధి చేస్తారు. అనంతరం అమ్మవారి ఆభరణాలను తిరిగి అడెల్లి పోచమ్మ ఆలయానికి తీసుకెళ్తారు. భక్తులు శోభాయాత్రకు మంగళహారతులతో ఘనస్వాగతాలు పలికారు. శోభాయాత్ర పోడువున ఏలాంటి ఘటనలు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Uploaded Video:

దసరా వేళ అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతర.. భారీ బందోబస్తు నడుమ కొనసాగుతున్న శోభాయాత్ర!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *