Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రామచంద్రపురంలో సినిమా పక్కీలో భారీ బంగారం చోరీ.. సోలాపూర్ గ్యాంగ్ అరెస్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సినిమా పక్కీలో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.3 కోట్ల విలువైన 2.5 కేజీల బంగారాన్ని నిందితులు అపహరించారు. మహారాష్ట్రలోని థానే జిల్లా కల్హేర్‌కు చెందిన జితేంద్ర సింగ్ రాజ్ పురోహిత్, బంగారాన్ని బ్యాగులో పెట్టుకుని నరసాపురంలోని బంగారు వ్యాపారులకు అందించేందుకు కాకినాడ–రావులపాలెం పల్లెవెలుగు బస్సులో ప్రయాణిస్తుండగా నిందితులు అతడిని అనుసరించారు. రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద ఓ నిందితుడు ప్రయాణికులతో గొడవపడి దృష్టి మరల్చి, బంగారం ఉన్న బ్యాగును కిటికీలోంచి బయటకు విసిరేశాడు. బయట వేచి ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు బ్యాగును తీసుకుని కారులో పరారయ్యారు. సెల్‌ఫోన్, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోలాపూర్ గ్యాంగ్‌గా గుర్తించారు. ఈ గ్యాంగ్‌పై 24 కేసులు ఉండగా, సుమారు 40.836 కేజీల బంగారం చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *