వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు (వేదాయపాలెం): నెల్లూరు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ కె.
- మాధవికి అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అదనపు డీఎంఈ)గా ఉద్యోగోన్నతి లభించింది.
- ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నెల్లూరు (వేదాయపాలెం): నెల్లూరు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ కె. మాధవికి అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అదనపు డీఎంఈ)గా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి అనంతరం కూడా ఆమె జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆసుపత్రి పరిపాలన, వైద్య సేవల పర్యవేక్షణతో పాటు అదనపు డీఎంఈ హోదాకు సంబంధించిన బాధ్యతలను ఆమె నిర్వహించనున్నారు. పదోన్నతిపై వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి ఉద్యోగులు మాధవికి అభినందనలు తెలిపారు.