*కూటమి పార్టీల ఎన్నికల సమన్వయ సమావేశానికి హాజరైన తుమ్మలపల్లి రమేష్*
కాకినాడ జిఆర్టి హోటల్లో మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన నిర్వహించిన కూటమి పార్టీల ఎన్నికల సమన్వయ సమావేశానికి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు.
ఈ సమావేశంలో కూటమి పార్టీల మధ్య ఎన్నికల సమన్వయం, పార్టీ కార్యక్రమాలు, రానున్న ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కూటమి పార్టీల నాయకులు, ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో కూటమి పార్టీల సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

