ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఈ సందర్భంగా పూర్వపు తెలంగాణ (2001) ఉద్యమకారులు మాట్లాడుతూ..
2001 నుండి తెలంగాణ ఉద్యమం పూర్వపు వరంగల్ జిల్లా అధ్యక్షులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బాటలో ముందుకు నడవడం జరిగింది
గులాబీ జెండా టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి మాటే ద్యేయంగా ముందుకు నడిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..
తెలంగాణ ఉద్యమంలో పెద్ది పోషించిన పాత్ర చిరస్మరణీయం
నాటి టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పెద్ది అందించిన సేవలు మరువలేనిది
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం తెలంగాణ ఉద్యమానికి ఏ నాటికి తీరని లోటు .
ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేయాలి
ఉద్యమానికి ఊపిరి పోసి ఆనాడు నర్సంపేట అంటే ఉద్యమాల గడ్డ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి ముందుకు నడిపించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు
పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తన జీవితం మొత్తం ఉద్యమమే ఊపిరిగా ప్రజలే కుటుంబం అని ముందుకు అని సాగాడు ..
ప్రజా జీవితాన్ని, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని, నర్సంపేట ప్రాంత అభివృద్ధి కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట , ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నరావుపేట మండలాల పూర్వపు ఉద్యమకారులు పాల్గొన్నారు.



