నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. పాత వెల్లంటి గ్రామంలో రూ.56 లక్షలు, కొండ్లపూడిలో రూ.39 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉండే కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, సీపీఎం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

నెల్లూరు రూరల్ అభివృద్ధే లక్ష్యం: గిరిధర్ రెడ్డి