Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఆంజనేయస్వామి ఆలయంలో బెల్ట్‌షాపు వేలం.. రూ.2.10 లక్షలకు దక్కించుకున్న వ్యాపారి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆంజనేయస్వామి ఆలయంలో బెల్ట్‌షాపు వేలం.. రూ.2.10 లక్షలకు దక్కించుకున్న వ్యాపారి

పెనుబల్లి / ఖమ్మం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొండ్రుపాడు గ్రామంలో బెల్ట్‌షాపు నిర్వహణకు వేలం పాట నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలోనే వేలం నిర్వహించడం స్థానికంగా చర్చకు దారితీసింది. బెల్ట్‌షాపు నిర్వహణకు తీవ్ర పోటీ నెలకొనడంతో వేలం నిర్వహించినట్లు తెలుస్తోంది. ముగ్గురు, నలుగురు పోటీపడగా ఓ వ్యాపారి రూ.2.10 లక్షలకు వేలం దక్కించుకున్నట్లు సమాచారం. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని దేవాలయాల అభివృద్ధి, పాఠశాలల అభివృద్ధికి కేటాయిస్తామని గ్రామ పెద్దలు తెలిపినట్లు తెలిసింది. అయితే, ఆలయంలోనే బెల్ట్‌షాపు వేలం నిర్వహించడంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆంజనేయస్వామి ఆలయంలో బెల్ట్‌షాపు వేలం.. రూ.2.10 లక్షలకు దక్కించుకున్న వ్యాపారి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *