Friday, 2 October 2026
  • Home  
  • డబ్బులు లేని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో ముద్దాయికి శిక్ష
- తూర్పు గోదావరి

డబ్బులు లేని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో ముద్దాయికి శిక్ష

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి ప్రతినిధి) రాజమండ్రిలో చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. డబ్బులు లేని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో ముమ్మిడివరం (M) ప్రాంతానికి చెందిన రాజపూడి విజయానాథ్ మూర్తికి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు తెలియవచ్చినది. వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన కాశీ విశ్వేశ్వరరావుకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి నిందితుడు చెక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా, ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో చెక్కు చెల్లకుండా తిరిగి వచ్చింది. దీంతో బాధితుడు న్యాయపరమైన చర్యలను ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం, చెక్కు బౌన్స్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించిన అనంతరం నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, ఫిర్యాదుదారుకు రూ.10 వేల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించినది.

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి ప్రతినిధి)
రాజమండ్రిలో చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. డబ్బులు లేని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో ముమ్మిడివరం (M) ప్రాంతానికి చెందిన రాజపూడి విజయానాథ్ మూర్తికి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు తెలియవచ్చినది.

వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన కాశీ విశ్వేశ్వరరావుకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి నిందితుడు చెక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా, ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో చెక్కు చెల్లకుండా తిరిగి వచ్చింది. దీంతో బాధితుడు న్యాయపరమైన చర్యలను ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన న్యాయస్థానం, చెక్కు బౌన్స్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించిన అనంతరం నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, ఫిర్యాదుదారుకు రూ.10 వేల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.