Wednesday, 30 September 2026
  • Home  
  • గడ్డపార చేతబట్టి… డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టి…
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గడ్డపార చేతబట్టి… డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టి…

*గడ్డపార చేతబట్టి… డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టి…* సెప్టెంబర్ 29(పున్నమి ప్రతినిధి )ముత్యాల గిరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు గడ్డపారలు చేత పట్టి వీబీ జీ రాంజీ పనులను ప్రారంభించారు. కొత్త డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా కొకులవారిపల్లి గ్రామంలో పొలాల మధ్యకు నిర్మించతలపెట్టిన డొంక రోడ్డుకు శ్రమదానం చేశారు. గడ్డపారలతో ముగ్గురు నేతలు మట్టిని తవ్వగా, ఆ గ్రామానికి చెందిన వీబీ జీ రాంజీ శ్రామికులు గంపలతో మట్టిని ఎత్తి రోడ్డు పోశారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో డొంక రోడ్లకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాలు ఉన్న 167 నియోజకవర్గాల పరిధిలో నియోజక వర్గానికి ఒక్కటి చొప్పున డొంక రోడ్డు నిర్మించనుండగా, ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో కొకులవారిపల్లి గ్రామంలో నిర్మించతలపెట్టిన డొంక రోడ్డు పనులను శ్రమదానం ద్వారా గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించారు. అంతకు ముందు కొకులవారిపల్లి గ్రామంలో పల్లెపండుగ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ముగ్గురు నేతలు కాలినడకన పరిశీలించారు. గ్రామ సరిహద్దుల్లో పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టె స్వాగతం పలుకగా, గ్రామంలోకి వేసిన బీటీ రోడ్డు, గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు, రోడ్డుకి సమీపంలో ఉన్న మినీ గోకులాన్ని పరిశీలించారు. రోడ్డు నాణ్యతను తనిఖీ చేశారు. సుమారు కిలోమీటరు మేర కాలినడకన కొకులవారిపల్లి గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి గ్రూప్ ఫొటో దిగారు. అంతకు ముందు తమ గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ పీవీఎన్ మాధవ్ గార్లకు కొకులవారిపల్లి గ్రామానికి చెందిన మహిళలు గ్రామ సరిహద్దుల నుంచి పూల జల్లులతో స్వాగతం పలికారు. మహిళలతో ముచ్చటిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముగ్గురు నేతలు గ్రామంలోకి నడిచి వెళ్లారు. .

*గడ్డపార చేతబట్టి… డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టి…*

సెప్టెంబర్ 29(పున్నమి ప్రతినిధి )ముత్యాల గిరి

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు గడ్డపారలు చేత పట్టి వీబీ జీ రాంజీ పనులను ప్రారంభించారు. కొత్త డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా కొకులవారిపల్లి గ్రామంలో పొలాల మధ్యకు నిర్మించతలపెట్టిన డొంక రోడ్డుకు శ్రమదానం చేశారు. గడ్డపారలతో ముగ్గురు నేతలు మట్టిని తవ్వగా, ఆ
గ్రామానికి చెందిన వీబీ జీ రాంజీ శ్రామికులు గంపలతో మట్టిని ఎత్తి రోడ్డు పోశారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో డొంక రోడ్లకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాలు ఉన్న 167 నియోజకవర్గాల పరిధిలో నియోజక వర్గానికి ఒక్కటి చొప్పున డొంక రోడ్డు నిర్మించనుండగా, ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో కొకులవారిపల్లి గ్రామంలో నిర్మించతలపెట్టిన డొంక రోడ్డు పనులను శ్రమదానం ద్వారా గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ఉప
ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించారు.
అంతకు ముందు కొకులవారిపల్లి గ్రామంలో పల్లెపండుగ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ముగ్గురు నేతలు కాలినడకన పరిశీలించారు. గ్రామ సరిహద్దుల్లో పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టె స్వాగతం పలుకగా, గ్రామంలోకి వేసిన బీటీ రోడ్డు, గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు, రోడ్డుకి సమీపంలో ఉన్న మినీ గోకులాన్ని పరిశీలించారు. రోడ్డు నాణ్యతను తనిఖీ చేశారు. సుమారు కిలోమీటరు మేర కాలినడకన కొకులవారిపల్లి గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి గ్రూప్ ఫొటో దిగారు.
అంతకు ముందు తమ గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ పీవీఎన్ మాధవ్ గార్లకు కొకులవారిపల్లి గ్రామానికి చెందిన మహిళలు గ్రామ సరిహద్దుల నుంచి పూల జల్లులతో స్వాగతం పలికారు. మహిళలతో ముచ్చటిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముగ్గురు నేతలు గ్రామంలోకి నడిచి వెళ్లారు.
.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.