లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య పరిరక్షణకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. సర్పంచ్ వేద ప్రణీత్ రెడ్డి, ఎంపీఓ సోలామన్ రాజ్ సమక్షంలో గ్రామంలోని ప్రతి ఇంటికీ చెత్తబుట్టలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి చెత్తబుట్టల్లోనే వేయాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రియాంక, పంచాయతీ కార్యదర్శి సంజయ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
స్వచ్ఛ బాగాపూర్ లక్ష్యంగా.. ప్రతి ఇంటికీ చెత్తబుట్ట
లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య పరిరక్షణకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. సర్పంచ్ వేద ప్రణీత్ రెడ్డి, ఎంపీఓ సోలామన్ రాజ్ సమక్షంలో గ్రామంలోని ప్రతి ఇంటికీ చెత్తబుట్టలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి చెత్తబుట్టల్లోనే వేయాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రియాంక, పంచాయతీ కార్యదర్శి సంజయ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

