నంద్యాల పాల కేంద్రం 39వ సర్వసభ్య సమావేశాన్ని భవనం లోపల నిర్వహించకుండా, పోలీసులు అడ్డుకోవడంతో గేటు ముందు రోడ్డుపైనే నిర్వహించాల్సి వచ్చిందని ఛైర్మన్ ఎస్.వి. జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మండుటెండలోనే డైరెక్టర్లు, సభ్యులకు అజెండా అంశాలను చదివి వినిపించారు. కనీసం భోజనం చేయడానికి కూడా లోపల సరైన వాతావరణం లేకపోవడంతో, హాజరైన మహిళలు, సభ్యులు రోడ్డుపైనే తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఛైర్మన్ పేర్కొన్నారు

నంద్యాల పాల కేంద్రం వద్ద ఉద్రిక్తత: రోడ్డుపైనే సర్వసభ్య సభ