రచన..తిరుమల నాగేంద్ర కుమార్వందనం ఓ స్నేహమా
అభివందనం ఓ ఆత్మీయమా
మరువలేదు మనసు నీతో సాగిన సమయాలే
వీడలేదు వయసు నీతో చేసిన సరదాలే
నిజమేనా ఓ పాటి కురుమన్న
ఇది నిజమేనా పదవి విరమణ నిజమేనా
నా కంట కన్నీరు పొంగించే ఈ మహోత్సవం
పదవి విరమణ మహోత్సవం
గురు బోధన పదవి విరమించినా
మన బంధం శాశ్వితమే నా గుండెలోన
మల్లె గంధమంటి మీ మనస్సు
పదుగురు మేలు కోరి అండగా నిలిచే నీ స్నేహ హృదయం బంగారు వర్ణం
కష్ట కాలాన్ని కూడా మరిపించే నీ స్నేహం
కానరాలే ఏ కష్టం కమనీయం ప్రతి క్షణం
సెలయేటి అలల్లాంటి నీ ఉరకలు ప్రతి ఉదయ ఉషోదయాలై
ఆయురారోగ్యాలతో చిరునవ్వులతో
చిరకాలం వర్ధిల్లు ఓ గురు
పాటి కురుమయ్య
మా బంగారు బావ పాటి కురుమయ్య
వందనం ఓ స్నేహమా
అభివందనం ఓ ఆత్మీయమా
*రచన..తిరుమల నాగేంద్ర కుమార్*



