వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందజేస్తున్న డాక్టర్ జె.ప్రవీణ్ కుమార్
ముద్దనూరు : ఆడపిల్లలకు సర్వైకల్ కేన్సర్ రాకుండా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్పివి వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా టీకా అధికారి డాక్టర్ జె.ప్రవీణ్‌కుమార్ కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డాక్టర్ జె.ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హెచ్‌పీవి టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం జె.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆడ పిల్లలకు సరైకల్ కేన్సర్ రాకుండా రాష్ట్ర ప్రభు త్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందన్నారు. జిల్లాకు 9వేల డోసులు అందు బాటులో ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్టోబర్ 7వరకు హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వేస్తున్నామన్నారు. 56 మంది పిల్లలకు హెచ్పివి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. అనంతరం సర్టిఫికెట్ అందజేశారు. ఆడ పిల్లలు వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డాక్టర్ కరిష్మా,హెల్త్ ఆఫీసర్లు మునిరెడ్డి, ప్రసాద్ యాదవ్, సూపర్వైజర్లు రామారావు, శివగంగ, ల్యాబ్ టెక్నీషియన్ జాసన్, సిబ్బంది. ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


