నర్సంపేట: దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా, నర్సంపేట పట్టణంలోని మదర్స్ ల్యాండ్ హై స్కూల్ లో విద్యార్థులకు డ్రాయింగ్ మరియు స్పీచ్ పోటీలను ఘనంగా నిర్వహించారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, బీజేపీ నర్సంపేట పట్టణ అధ్యక్షులు శ్రీ గూడూరు సందీప్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి సేవా సంకల్ప్ అభియాన్ వరంగల్ జిల్లా కన్వీనర్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు.నరేంద్ర మోదీ – ప్రస్తుత భారతదేశం అనే అంశంపై విద్యార్థులు తమ కుంచెతో, తమ మాటలతో అద్భుతంగా ఆవిష్కరించారు. మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, చంద్రయాన్ విజయాలు, యువతకు లభిస్తున్న అవకాశాలను తమ డ్రాయింగుల్లో చూపించారు.
ఈ సందర్భంగా డా. రాణా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుండే దేశం గురించి ఆలోచించాలి. మోదీ గారిలాంటి నాయకుడి స్ఫూర్తితో మీరు కూడా భవిష్యత్తులో దేశానికి సేవ చేయాలి. చదువుతో పాటు సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి అని పిలుపునిచ్చారు.
అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డా. రాణా ప్రతాప్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ పాశికంటి రమేష్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు, నియోజకవర్గ నాయకుడు జూలూరు మనీష్ గౌడ్,సీనియర్ నాయకులు వల్లే పర్వతాలు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు విజయ్ సింగ్, నాగేంద్ర బాబు, ముత్యాల శ్రీనివాస్, పోనుగోటి రవీంద్ర చారి,చేను నరేష్, అజీమ్ పాషా,రాజు, కొండ్రా తరుణ్ సాయి,సంగెపు తేజా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నరేంద్ర మోదీ – నేటి భారతం” అంశంపై విద్యార్థుల అద్భుత ప్రతిభ
నర్సంపేట: దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా, నర్సంపేట పట్టణంలోని మదర్స్ ల్యాండ్ హై స్కూల్ లో విద్యార్థులకు డ్రాయింగ్ మరియు స్పీచ్ పోటీలను ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, బీజేపీ నర్సంపేట పట్టణ అధ్యక్షులు శ్రీ గూడూరు సందీప్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సేవా సంకల్ప్ అభియాన్ వరంగల్ జిల్లా కన్వీనర్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు.నరేంద్ర మోదీ – ప్రస్తుత భారతదేశం అనే అంశంపై విద్యార్థులు తమ కుంచెతో, తమ మాటలతో అద్భుతంగా ఆవిష్కరించారు. మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, చంద్రయాన్ విజయాలు, యువతకు లభిస్తున్న అవకాశాలను తమ డ్రాయింగుల్లో చూపించారు. ఈ సందర్భంగా డా. రాణా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుండే దేశం గురించి ఆలోచించాలి. మోదీ గారిలాంటి నాయకుడి స్ఫూర్తితో మీరు కూడా భవిష్యత్తులో దేశానికి సేవ చేయాలి. చదువుతో పాటు సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి అని పిలుపునిచ్చారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డా. రాణా ప్రతాప్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ పాశికంటి రమేష్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు, నియోజకవర్గ నాయకుడు జూలూరు మనీష్ గౌడ్,సీనియర్ నాయకులు వల్లే పర్వతాలు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు విజయ్ సింగ్, నాగేంద్ర బాబు, ముత్యాల శ్రీనివాస్, పోనుగోటి రవీంద్ర చారి,చేను నరేష్, అజీమ్ పాషా,రాజు, కొండ్రా తరుణ్ సాయి,సంగెపు తేజా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

