కొత్త చైర్మన్గా కొప్పల పావని.. వైస్ చైర్మన్గా గొంప వరం ఎన్నిక
విశాఖపట్నం జిల్లా,ఆనందపురం, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి):
విద్యార్థినుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ, పాఠశాల అభివృద్ధే లక్ష్యంగా కేజీబీవీ ఆనందపురం నూతన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు మంగళవారం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. లోడగలవానిపాలెం పంచాయతీ పరిధిలోని నేల్తేరు గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రిన్సిపాల్, ఎస్ఎంసీ కన్వీనర్ దొండా చంద్రకళ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించారు.
నూతన నాయకత్వం
ఎస్ఎంసీ చైర్మన్
కొప్పల పావని
ఎస్ఎంసీ వైస్ చైర్మన్
గొంప వరం
13 మంది తల్లిదండ్రుల ప్రతినిధులతో కమిటీ
నూతన కమిటీలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 13 మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. వారిలో గోకడ లక్ష్మి, పొట్నూరు రమ్య, నిమ్మకాయల భవాని, చెవ్వేటి దేవి, మరిక భారతి, రౌతు సత్యవతి, కోట్యాడ సంతోషి, ప్రసాదు దేముడమ్మ, ఈర్ల రాజేశ్వరి, రేణుక, బాలిరెడ్డి శ్రీను, ఉప్పిలి సూర్యనారాయణ, భీమవరపు శ్రీను ఉన్నారు.
ఉపాధ్యాయ, నామినేటెడ్ సభ్యులు
ఉపాధ్యాయ ప్రతినిధులుగా బి. నాగమణి, కేటీఎస్ ప్రసాదాని ఎంపికయ్యారు. నామినేటెడ్ సభ్యులుగా అక్కిరెడ్డి దేవుడు బాబు, స్థానిక ఏఎన్ఎం కమిటీలో చోటు దక్కించుకున్నారు.
విద్యార్థినుల ప్రగతే ప్రధాన లక్ష్యం
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దొండా చంద్రకళ మాట్లాడుతూ, నూతన ఎస్ఎంసీ కమిటీ సహకారంతో పాఠశాల మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.
నూతన చైర్మన్ కొప్పల పావని, వైస్ చైర్మన్ గొంప వరంతో పాటు కమిటీ సభ్యులు మాట్లాడుతూ పాఠశాల అభ్యున్నతికి, విద్యార్థినుల విద్యా ప్రమాణాల పెంపునకు, అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
విద్యార్థినుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, పాఠశాల ప్రగతికి నూతన కమిటీ సమష్టిగా కృషి చేయాలని ఈ ఎన్నికలు ఆశలు రేకెత్తించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




