Wednesday, 30 September 2026
  • Home  
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నామ శ్రీకారం అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి: మాజీ ఎంపీ నామ
- ఖమ్మం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నామ శ్రీకారం అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి: మాజీ ఎంపీ నామ

ఖమ్మం: వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శ్రీకారం చుట్టారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో తొలుత కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించారు. సతీమణి చిన్నమ్మ, కుమారులు పృథ్వి తేజ, భవ్య తేజతో పాటు 15 మంది కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయించారు. అనంతరం సుమారు 30 మంది గ్రాడ్యుయేట్ల వివరాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రాడ్యుయేట్లకు అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియలో సహకరించాలని కోరారు. ఖమ్మం నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, గడువులోగా నమోదు చేయించాలని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా బృందం ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని నామ పిలుపునిచ్చారు.

ఖమ్మం: వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శ్రీకారం చుట్టారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో తొలుత కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించారు. సతీమణి చిన్నమ్మ, కుమారులు పృథ్వి తేజ, భవ్య తేజతో పాటు 15 మంది కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయించారు. అనంతరం సుమారు 30 మంది గ్రాడ్యుయేట్ల వివరాలను నమోదు చేయించారు.

ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రాడ్యుయేట్లకు అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియలో సహకరించాలని కోరారు. ఖమ్మం నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, గడువులోగా నమోదు చేయించాలని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా బృందం ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని నామ పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.