Wednesday, 30 September 2026
  • Home  
  • జగ్గంపేట పల్లె పండుగ 3.0 అభివృద్ధి కేరాఫ్ జ్యోతుల నెహ్రూ
- తూర్పు గోదావరి

జగ్గంపేట పల్లె పండుగ 3.0 అభివృద్ధి కేరాఫ్ జ్యోతుల నెహ్రూ

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 29: జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు.మొదట శెట్టిబలిజిపేటలో భావారం ఫిల్టర్ వాటర్ స్కీం నుండి శుద్ధి చేసిన సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన 3 జిఎల్ఆర్ ట్యాంకులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ట్యాంకులతో ఆ ప్రాంత ప్రజల దీర్ఘకాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అనంతరం గోకవరం రోడ్డులోని బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలకు మెయిన్ రోడ్డు నుండి 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. జగ్గంపేట పట్టణ ప్రముఖులు, దాత మంతెన నీలాద్రిరాజు గారి సేవలను గుర్తిస్తూ ఆ రోడ్డుకు *మంతెన నీలాద్రిరాజు మార్గము* గా నామకరణం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 11 వేల కోట్ల రూపాయలతో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి జాతర జరుగుతోందని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్, అడపా భరత్, రాష్ట్ర డైరెక్టర్లు పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, గెద్దాడ సత్యవేణి, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, అడబాల భాస్కరరావు, ఉంగరాల రాము, మారిశెట్టి భద్రం, కన్నబాబు, కందుల చిట్టిబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి,పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, ఎస్ఏ గపూర్ కూటమి నాయకులు, పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులు, మండల అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 29:
జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు.మొదట శెట్టిబలిజిపేటలో భావారం ఫిల్టర్ వాటర్ స్కీం నుండి శుద్ధి చేసిన సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన 3 జిఎల్ఆర్ ట్యాంకులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ట్యాంకులతో ఆ ప్రాంత ప్రజల దీర్ఘకాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
అనంతరం గోకవరం రోడ్డులోని బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలకు మెయిన్ రోడ్డు నుండి 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. జగ్గంపేట పట్టణ ప్రముఖులు, దాత మంతెన నీలాద్రిరాజు గారి సేవలను గుర్తిస్తూ ఆ రోడ్డుకు *మంతెన నీలాద్రిరాజు మార్గము* గా నామకరణం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 11 వేల కోట్ల రూపాయలతో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి జాతర జరుగుతోందని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్, అడపా భరత్, రాష్ట్ర డైరెక్టర్లు పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, గెద్దాడ సత్యవేణి, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, అడబాల భాస్కరరావు, ఉంగరాల రాము, మారిశెట్టి భద్రం, కన్నబాబు, కందుల చిట్టిబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి,పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, ఎస్ఏ గపూర్ కూటమి నాయకులు, పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులు, మండల అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.