Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

గౌడకుటుంబాలను బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి:మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గౌడకుటుంబాలను బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి:మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్

వార్త ముఖ్యాంశాలు

  • నిజామాబాదు జిల్లా తాల్ల రాంపూర్ లో 39 గౌడకుటుం బాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై కేసులు నమోదు చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.హన్మకొండ పట్టణంలో మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం…
  • ఇట్లా ఇంకెంత ఎంతకాలం రాష్ట్రంలో ఎక్కడ లేని విదంగా వీడీసీ ల ముసుగులో అగ్ర వర్ణ అరాకచక కాలు నీచ క్రీడలను అరికట్టి ప్రజా స్వామ్యాన్ని కాపాడే దమ్ము ధైర్యం లేని మన జిల్లా అధికార యంత్రాంగం ఏ ఒక్క సమర్ధత గల అధికారి లేని జిల్లాగా…
  • ఇంత వరకు గౌడ కులం వారికే పరిమితమైన "వెలివేత" అగ్ర ఆగడాలపై తిరగబడే అట్టడుగు కులాలకు వ్యాపిస్తుంది.విడిపోతే చెడిపోతామని,గడియకు గండంగా మన బతుకు చితికి పోయే ప్రమాదం అతి సమీపంలో ఉందని రమేష్ గౌడ్ హెచ్చరించారు.ఎదురు చూపులు మానుకొని బహిష్కరణ చేసిన దోషులను అరెస్ట్ చేసి,గౌడ కులస్థుల…

నిజామాబాదు జిల్లా తాల్ల రాంపూర్ లో 39 గౌడకుటుం
బాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై కేసులు నమోదు చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.హన్మకొండ పట్టణంలో మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు తోటకూరి రాందాస్ గౌడ్ అధ్యక్షతన .ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మోకుదెబ్బ రమేష్ గౌడ్ మాట్లా డుతూ గతంలో జక్రాన్ పెళ్లి,పిప్రి లో నేడు తాళ్ల రాంపూర్ లోవిలేజ్ డెవలప్మెంట్ కమిటీ (వీడిసి)లు 39 గౌడ కుటుంబాలను బహిష్కరణ చేయడం సభ్యసమాజం తలదించుకునే విషయమన్నారు. ఇట్లా
ఇంకెంత ఎంతకాలం రాష్ట్రంలో ఎక్కడ లేని విదంగా వీడీసీ ల ముసుగులో అగ్ర వర్ణ అరాకచక కాలు నీచ క్రీడలను అరికట్టి ప్రజా స్వామ్యాన్ని కాపాడే దమ్ము ధైర్యం లేని మన జిల్లా అధికార యంత్రాంగం ఏ ఒక్క సమర్ధత గల అధికారి లేని జిల్లాగా మారినా మనలో అత్యధిక జన బలగలం మన బహుజన సమాజంలో తగిన తగినంత చలనం లేక పోవటం సిగ్గు చేటు వేదిక మీద వేదికల ఊపిరాడక వేద మంత్రాల చదవడం చదివినట్లు మాట్లాడం వల్ల ఏ మాత్రం లాభం లేదు. ఇంత వరకు గౌడ కులం వారికే పరిమితమైన “వెలివేత” అగ్ర ఆగడాలపై తిరగబడే అట్టడుగు కులాలకు వ్యాపిస్తుంది.విడిపోతే చెడిపోతామని,గడియకు గండంగా మన బతుకు చితికి పోయే ప్రమాదం అతి సమీపంలో ఉందని రమేష్ గౌడ్ హెచ్చరించారు.ఎదురు చూపులు మానుకొని బహిష్కరణ చేసిన దోషులను అరెస్ట్ చేసి,గౌడ కులస్థుల
కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో జిల్లాలో జైలు బరోకార్యక్రమాల వంటి నిరసనలకు అన్ని గౌడ సంఘాలు ఐక్యంగా పిలుపు నిచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేసి ఐక్యతను చాటాలని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్య
దర్శి వల్లాల సదానందం గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మగాని శ్యామ్ సుందర్ గౌడ్,పట్టణ గౌరవ అధ్యక్షులు
జూలూరి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి గడ్డమీది
అశ్విన్ గౌడ్, తాళ్లపెళ్లి చంద్రమౌలి గౌడ్, రడం శ్రీనివాస్ గౌడ్, బొమ్మేర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *