Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో సమానత్వ సమాజం కోసం పోరాడాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భగత్‌సింగ్‌ స్ఫూర్తితో సమానత్వ సమాజం కోసం పోరాడాలి

వార్త ముఖ్యాంశాలు

  • కుల వివక్ష, మత విద్వేషాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి పిండిప్రోలు, సెప్టెంబర్‌ 28: షాహిద్‌ భగత్‌సింగ్‌ ఆశయాల స్ఫూర్తితో కుల వివక్ష, మత విద్వేషాలు, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని CPIML మాస్‌లైన్‌, PDSU, PYL నాయకులు పిలుపునిచ్చారు.
  • భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా పిండిప్రోలు గ్రామంలో నిర్వహించిన సభలో నాయకులు మాట్లాడారు.
  • సభకు PYL గ్రామ అధ్యక్షుడు రాయిండ్ల వినోద్‌ అధ్యక్షత వహించగా, గోకినపల్లి నవీన్‌ (బోస్‌), పూజల మహేందర్‌, పరికిపల్లి నరేష్‌, గోకినపల్లి శంకర్‌, మరికంటి శంకర్‌, కత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు.

కుల వివక్ష, మత విద్వేషాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి

పిండిప్రోలు, సెప్టెంబర్‌ 28:
షాహిద్‌ భగత్‌సింగ్‌ ఆశయాల స్ఫూర్తితో కుల వివక్ష, మత విద్వేషాలు, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని CPIML మాస్‌లైన్‌, PDSU, PYL నాయకులు పిలుపునిచ్చారు. భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా పిండిప్రోలు గ్రామంలో నిర్వహించిన సభలో నాయకులు మాట్లాడారు.

సభకు PYL గ్రామ అధ్యక్షుడు రాయిండ్ల వినోద్‌ అధ్యక్షత వహించగా, గోకినపల్లి నవీన్‌ (బోస్‌), పూజల మహేందర్‌, పరికిపల్లి నరేష్‌, గోకినపల్లి శంకర్‌, మరికంటి శంకర్‌, కత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు.

భగత్‌సింగ్‌ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదని, అన్యాయాన్ని ప్రశ్నించే చైతన్యానికి ప్రతీక అని నాయకులు పేర్కొన్నారు. యువత చదివి, ఆలోచించి, ప్రశ్నిస్తూ శాస్త్రీయ దృక్పథంతో సామాజిక న్యాయం కోసం ముందుకు సాగాలని కోరారు.

“భగత్‌సింగ్‌ను స్మరించుకోవడం అంటే ఆయన ఆశయాలను ఆచరించడమే” అని పేర్కొంటూ, సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *