కావలి ఏరియా ఆసుపత్రిలో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్ స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి, బ్రహ్మానందం, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



