నిర్మల్: దేశ ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సంఘంలోని ఇతర సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ డిమాండ్ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని పేర్కొన్నారు.
జ్ఞానేష్ కుమార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కౌన్సిలర్లు తౌహీద్ ఉద్దీన్ అలియాస్ రఫ్ఫూ, జాకీ, షేక్ సల్మాన్, మహమ్మద్ రఫీ, షేక్ ఫిరోజ్, షాకీర్, షేక్ జాకీర్, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అస్లాం, మాజీ కౌన్సిలర్ సలీం, జఫర్, నదీమ్ షేక్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

నిర్మల్ లో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం
నిర్మల్: దేశ ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సంఘంలోని ఇతర సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ డిమాండ్ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని పేర్కొన్నారు. జ్ఞానేష్ కుమార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కౌన్సిలర్లు తౌహీద్ ఉద్దీన్ అలియాస్ రఫ్ఫూ, జాకీ, షేక్ సల్మాన్, మహమ్మద్ రఫీ, షేక్ ఫిరోజ్, షాకీర్, షేక్ జాకీర్, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అస్లాం, మాజీ కౌన్సిలర్ సలీం, జఫర్, నదీమ్ షేక్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

