*ఉద్యమ నిప్పుకణిక, సర్దార్ భగత్ సింగ్ 119వ జయంతి స్ఫూర్తితో*
కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
కొండపల్లి*
ఉద్యమ నిప్పుకణిక, సర్దార్ భగత్ సింగ్ 119వ జయంతి స్ఫూర్తితో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని SFI–CITU కేంద్ర కమిటీ పిలుపు మేరకు కొండపల్లి SFI పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా SFI పట్టణ కార్యదర్శి బి. కుషాల్ కుమార్, PNM-B శ్రీనుతో కలిసి CITU ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం. మహేష్ ర్యాలీ నిర్వహించి, సర్దార్ భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప విప్లవ యోధుడని అన్నారు. జలియన్‌వాలాబాగ్ ఘటన వంటి బ్రిటిష్ వలస పాలకుల దమనకాండలు ఆయనను తీవ్రంగా కలచివేశాయని, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు.
భగత్ సింగ్ ఆశయాల స్ఫూర్తితో దేశ సమైక్యత, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం విద్యార్థులు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికీ సమానంగా అందేలా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్
*తక్షణమే రాజీనామా చేయాలి!*
– ఎన్నికల ప్రక్రియలో తటస్థతపై రాజీ పడుతున్నారనే విమర్శలకు సమాధానం చెప్పాలి.
– రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఎన్నికల వ్యవస్థ పనిచేయాలి.
– అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి.
– స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాలి.
ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, పారదర్శకంగా, పక్షపాతరహితంగా పనిచేయాలని SFI–CITU డిమాండ్ చేసింది.
ప్రజాస్వామ్యానికి కావాల్సింది
పక్షపాత రహిత ఆలోచనలు — పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థ!
ఎస్ఎఫ్ఐ
స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
ప్రజాస్వామ్య, పారదర్శక, ప్రజల ఎన్నికల వ్యవస్థ ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలన్నారు… *ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు శ్యాం కుమార్ రెడ్డి, షాభాషి తదితరులు పాల్గొన్నారు*




