వార్త ముఖ్యాంశాలు
- రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన, సమాజ మార్పు కోసం ప్రశ్నించే దళిత గొంతులన్నీ ఏకం కావాలని దళిత మేధా శక్తి వ్యవస్థాపక ఆవిర్భావ సభ్యులు కొయ్యడ కుమారస్వామి, బోట్ల దయాకర్ పిలుపునిచ్చారు.
- ఆదివారం దస్తగిరిపల్లిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ...
- దళిత సంఘాల ఐక్యతతోనే దళిత పల్లెల్లో ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన, సమాజ మార్పు కోసం ప్రశ్నించే దళిత గొంతులన్నీ ఏకం కావాలని దళిత మేధా శక్తి వ్యవస్థాపక ఆవిర్భావ సభ్యులు కొయ్యడ కుమారస్వామి, బోట్ల దయాకర్ పిలుపునిచ్చారు.
ఆదివారం దస్తగిరిపల్లిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ… దళిత సంఘాల ఐక్యతతోనే దళిత పల్లెల్లో ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయన్నారు. చిన్న చిన్న విభేదాలు పక్కనబెట్టి దళితుల ఐక్యత, హక్కులు, రాజ్యాధికార సాధన కోసం ఉద్యమించాలని కోరారు.
అనంతరం ‘దళిత మేధా శక్తి’ దస్తగిరిపల్లి గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడు సంగి సురేష్ ప్రధాన కార్యదర్శి కుమ్మరి సంపత్ ఉపాధ్యక్షుడు పెంబర్తి సదయ్య అధికార ప్రతినిధి సంగి నర్సయ్య సహాయ కార్యదర్శి సంగి ప్రశాంత్
కోశాధికారి రుద్రారపు వినోద్ కమిటీ సభ్యులు సంగి పెద్ద మొగిలి, రేణుకుంట్ల ప్రశాంత్, లడ్డునూరి రాజయ్య.
ఈ కార్యక్రమంలో మండల నాయకుడు పెంబర్తి విష్ణు తదితరులు పాల్గొన్నారు.