ఖమ్మం: భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ (మనసులోని మాట) కార్యక్రమాన్ని ఖమ్మం నగరంలోని డాక్టర్స్ మెడికల్ అకాడమీలో విద్యార్థినులతో కలిసి బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్యా శ్యాం సుందర్ నాయక్, జిల్లా అధ్యక్షులు టి. వీరభద్రం, బీజేపీ సీనియర్ నాయకులు మోతుకూరి నారాయణరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు జ్వాలా నరసింహరావు, గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని విద్యార్థినులతో కలిసి ఆసక్తిగా వీక్షించారు. దేశాభివృద్ధి, యువత పాత్ర, సమాజంలో విద్యార్థుల బాధ్యత వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు.



