వార్త ముఖ్యాంశాలు
- నంద్యాల: నంద్యాల పట్టణ పరిధిలోని ఎస్‌ఆర్‌బీసీ ప్రాంతంలో ఏపిటిడ్కో, పీఎంఏవై కింద నిర్మించిన జి+3 గృహాల తాళాలను ఈ నెల 27న లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి.
- శేషన్న తెలిపారు.ఆదివారం ఉదయం 10 గంటలకు ఎస్‌ఆర్‌బీసీ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎన్.ఎమ్.డి.
- ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ జి.
నంద్యాల: నంద్యాల పట్టణ పరిధిలోని ఎస్‌ఆర్‌బీసీ ప్రాంతంలో ఏపిటిడ్కో, పీఎంఏవై కింద నిర్మించిన జి+3 గృహాల తాళాలను ఈ నెల 27న లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న తెలిపారు.ఆదివారం ఉదయం 10 గంటలకు ఎస్‌ఆర్‌బీసీ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ముఖ్య అతిథులుగా హాజరై తాళాలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. 300, 365, 430 చదరపు అడుగుల ఇళ్లు కేటాయించిన లబ్ధిదారులు, పట్టణ ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ కోరారు.