ఖమ్మం రూరల్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తీర్దాలకు చెందిన సీతాల నాగరాజు ఖమ్మం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా కామంచికల్ వద్ద గుండెపోటు రావడంతో రోడ్డుపై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. నాగరాజు మృతితో తీర్దల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.



