రైల్వేకోడూరు మండలం కే-బుడుగుంటపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నిర్మలాదేవి, సీడీపీఓ రేణుకతో పాటు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆరోగ్య కార్యకర్తలు, మహిళా మోర్చా జిల్లా సెక్రటరీ కుప్పాల జ్యోతి, మండల అధ్యక్షుడు సాయం శ్రీధర్, ప్రధాన కార్యదర్శులు కాళప్పగారి రాము, కుప్పాల కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాల అమలును పరిశీలించారు. కేంద్రాల ద్వారా అందుతున్న ఆహార పదార్థాలు సకాలంలో అందుతున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, అభివృద్ధికి అంగన్వాడీ సేవలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. సేవలను అంకితభావంతో అందిస్తున్న అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలను సన్మానించి అభినందించారు.


