ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కూటమి సభ్యులతో నిర్వహించిన తొలి సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డీఎస్సీ ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. డీఎస్సీ అభ్యర్థుల ఆశలు, ఆకాంక్షలతో రాజకీయాలు చేయడం తగదని అన్నారు. ప్రతిపక్షాలు ఎల్లప్పుడూ ఏదో ఒక అంశాన్ని వివాదంగా మార్చి రాద్ధాంతం చేయడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి ఆనం పేర్కొన్నారు.

డీఎస్సీపై ప్రతిపక్షాల విమర్శలు రాజకీయ దురుద్దేశంతోనే: మంత్రి ఆనం