Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇంద్రకీలాద్రిపై కొండచరియల ఘటనపై మంత్రి ఆనం సమీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఇంద్రకీలాద్రిపై కొండచరియల ఘటనపై మంత్రి ఆనం సమీక్ష

వార్త ముఖ్యాంశాలు

  • విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రాంగణంలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తక్షణమే స్పందించారు.
  • ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని పరిస్థితిని సమీక్షించారు.
  • భక్తుల భద్రతతో పాటు ఆలయ సిబ్బంది రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రాంగణంలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తక్షణమే స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని పరిస్థితిని సమీక్షించారు. భక్తుల భద్రతతో పాటు ఆలయ సిబ్బంది రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *