Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆపదలో అండగా సీఎం సహాయ నిధి: పాశం సునీల్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆపదలో అండగా సీఎం సహాయ నిధి: పాశం సునీల్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • గూడూరు: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు.
  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి 29వ విడతలో మంజూరైన రూ.58 లక్షల విలువైన 122 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో ప్రజలకు తక్షణ సహాయం అందించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.

గూడూరు: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి 29వ విడతలో మంజూరైన రూ.58 లక్షల విలువైన 122 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో ప్రజలకు తక్షణ సహాయం అందించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలోని అనేక పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతోందని తెలిపారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *