నెల్లూరు నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న హత్యలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్ పరిధిలోని అశోక్‌నగర్ వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అలాగే పొట్టేపాళెం వద్ద రోహిత్ (28)ను పాతకక్షల నేపథ్యంలో కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. రౌడీషీటర్ కమ్మసాయిని ఆర్డీవో కార్యాలయం సమీపంలో దారుణంగా హత్య చేసిన ఘటన కూడా సంచలనం సృష్టించింది. తాజాగా నిన్న ఓ వ్యక్తిపై దుండగులు కళ్లలో కారం చల్లి గొంతు కోసి పరారయ్యారు. వరుస ఘటనలతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేరాలను అరికట్టి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

నెల్లూరులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు