మహిళలు ధైర్యంగా నిలబడి నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని నంద్యాల DSP సుస్మిత సూచించారు. బుక్కాపురం గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ… అక్రమాలు, నేరాలపై మౌనం వహించకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బాల్య వివాహాలను అరికట్టి బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపిన ఆమె, సైబర్ నేరాలు, నూతన చట్టాలు మరియు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

మహిళలు ధైర్యంగా నేరాలను ప్రశ్నించాలి: నంద్యాల డిఎస్పీ సుస్మిత పిలుపు