ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు, సెప్టెంబరు 25: నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులు సమన్వయంతో పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర మానిటరింగ్ అధికారి డా. శ్రీనివాసవర్మ సూచించారు. శుక్రవారం మనుబోలు మండలంలోని పలు పాఠశాలలు, కళాశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, మాత్రల పంపిణీ, పాఠశాలలోనే మాత్రలు మింగిస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై టీవీల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మండలంలో 5,104 మంది విద్యార్థులు ఉండగా, తొలిరోజు 4,889 మందికి మాత్రలు ఇచ్చినట్లు పీహెచ్‌సీ వైద్యురాలు మోసీనా సుల్తానా తెలిపారు.

నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు, సెప్టెంబరు 25: నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులు సమన్వయంతో పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర మానిటరింగ్ అధికారి డా. శ్రీనివాసవర్మ సూచించారు. శుక్రవారం మనుబోలు మండలంలోని పలు పాఠశాలలు, కళాశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, మాత్రల పంపిణీ, పాఠశాలలోనే మాత్రలు మింగిస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై టీవీల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మండలంలో 5,104 మంది విద్యార్థులు ఉండగా, తొలిరోజు 4,889 మందికి మాత్రలు ఇచ్చినట్లు పీహెచ్‌సీ వైద్యురాలు మోసీనా సుల్తానా తెలిపారు.

