అంగన్‌వాడీ చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ

పున్నమి న్యూస్ రిపోర్టర్ – బోగోలు మండలం (గోపాలకృష్ణారెడ్డి)
బోగోలు, సెప్టెంబర్ 25: బోగోలు మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్‌లో ప్రముఖ నాయకుడిగా, తత్వవేత్తగా, మార్గదర్శకుడిగా విశేష సేవలందించారని పేర్కొన్నారు. ఆయన ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పునాదుల్లో కీలకమైనదని తెలిపారు.
జయంతి వేడుకల్లో భాగంగా బోగోలు మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పార్టీ నాయకులు సందర్శించారు. అక్కడి చిన్నారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వీరాల శ్రీనివాస్ యాదవ్, బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు నూకసాని శ్రీనివాసులు యాదవ్, మాజీ బీజేపీ మండల అధ్యక్షుడు గుర్రం వెంకటేశ్వర్లు, బీజేపీ మహిళా నాయకురాలు నూకసాని రాజ్యలక్ష్మి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గోపి కృష్ణ, పార్టీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

