అనంతసాగరం మండల స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు – డిప్యూటీ ఎంపీడీవో షాన్వాజ్
అనంతసాగరం, ఆగస్టు 4 (పున్నమి ప్రతినిధి): అనంతసాగరం మండలంలోని 16 స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై అధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. సమయపాలన పాటించకపోవడం, కార్యాలయం నుంచి బయటకు వెళ్లే సమయంలో మూమెంట్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేయకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 23 మంది సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు డిప్యూటీ ఎంపీడీవో షాన్వాజ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతతో వ్యవహరించి ప్రజలకు సకాలంలో, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ సేవల్లో క్రమశిక్షణ, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు.
మండలంలోని అన్ని స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, ఇకపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు ప్రతి ఉద్యోగి విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాలని అధికారులు సూచించారు.


