Friday, 25 September 2026
  • Home  
  • పాలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్ దివాకర్ టీ.ఎస్ పాలేరు జలాశయంలో నీటి మట్టం, ఇన్‌ఫ్లో పరిశీలన
- ఖమ్మం

పాలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్ దివాకర్ టీ.ఎస్ పాలేరు జలాశయంలో నీటి మట్టం, ఇన్‌ఫ్లో పరిశీలన

పాలేరు / ఖమ్మం పాలేరు జలాశయాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీ.ఎస్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. జలాశయంలోని ప్రస్తుత నీటి మట్టం, ఇన్‌ఫ్లో పరిస్థితిని అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి జలాశయం నుంచి నీటి విడుదలకు సంబంధించి పలు సూచనలు చేశారు. పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. వరద ప్రవాహ పరిస్థితిని ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి ప్రవాహం, జలాశయం పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

పాలేరు / ఖమ్మం

పాలేరు జలాశయాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీ.ఎస్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. జలాశయంలోని ప్రస్తుత నీటి మట్టం, ఇన్‌ఫ్లో పరిస్థితిని అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి జలాశయం నుంచి నీటి విడుదలకు సంబంధించి పలు సూచనలు చేశారు. పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. వరద ప్రవాహ పరిస్థితిని ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి ప్రవాహం, జలాశయం పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.