ఓబులవారిపల్లి మండలం రాళ్లచెరువుపల్లి గ్రామంలో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి అధికారులతో కలిసి రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల భూ హక్కులను పరిరక్షించడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రైతులకు భూమిపై యాజమాన్య హక్కులకు భరోసా కల్పించేందుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


