ఏకాత్మ మానవతా సిద్ధాంత రూపకర్తకు స్మరణాంజలి
ఖమ్మం: భారతీయ జనసంఘ్ ప్రముఖ నాయకుడు, ఏకాత్మ మానవతా సిద్ధాంత రూపకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాలేరు శాసనసభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత పాలేరు నియోజకవర్గ ఇంచార్జీ నున్నా రవికుమార్ పాల్గొని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా నాయకులు ఆయన దేశానికి అందించిన సేవలను, ఏకాత్మ మానవతా సిద్ధాంతం ద్వారా సమాజంలోని చివరి వ్యక్తి అభ్యున్నతికి ఇచ్చిన ప్రాధాన్యతను స్మరించుకున్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులర్పించారు.



