భారతీయ జనసంఘ్ నాయకుడు, రచయిత, ఏకాత్మ మానవతావాద సిద్ధాంత రూపకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల నాగేందర్, రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కో-కన్వీనర్ లక్ష్మీ రెడ్డి, రాష్ట్ర గిరిజన మోర్చా కన్వీనర్ శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు రవి రాథోడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, జిల్లా ఆఫీస్ సెక్రటరీ నక్క రవి గౌడ్, జిల్లా కార్యదర్శి శ్రీ రామనేని మణి, పాలేరు అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి నున్న రవి కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేఖా సత్యనారాయణ యాదవ్, కార్యదర్శి బొర్రా భాను ప్రకాష్ రఘునాథపాలెం మండల అధ్యక్షుడు గుత్తా వంశీ, ఎదులాపురం మండల అధ్యక్షుడు సత్తి నాగరాజు, ఖమ్మం టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవరావు, భూక్య బాలాజీ, త్రీ టౌన్ ఉపాధ్యక్షుడు గోనెల శివ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.



