Sunday, 13 September 2026
  • Home  
  • పుష్కరాల పనులు వేగవంతం చేయాలి: మంత్రి నారాయణ
- తూర్పు గోదావరి

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి: మంత్రి నారాయణ

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 ( పున్నమి ప్రతినిధి) రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించి, చేపట్టాల్సిన పనులు, వాటి పురోగతిపై అధికారులతో చర్చించారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఘాట్లు, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, పార్కింగ్ తదితర మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సమీక్షలో ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, కమీషనర్ రాహుల్ మీనా తదితర అధికారులు పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా నగరానికి వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి, అందుకు అనుగుణంగా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. పుష్కరాల పనుల్లో భాగంగా రూ.100 కోట్లతో చేపట్టిన 96 పనులను ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు తెలిపారు. ఈ పనుల్లో రహదారుల అభివృద్ధి, ఘాట్ల అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అదేవిధంగా హెచ్‌ఏఎం (HAM) విధానం కింద రూ.300 కోట్ల పనులు కూడా పుష్కరాల దృష్ట్యా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. పుష్కరాలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, అత్యవసర వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 ( పున్నమి ప్రతినిధి) రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించి, చేపట్టాల్సిన పనులు, వాటి పురోగతిపై అధికారులతో చర్చించారు.

పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఘాట్లు, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, పార్కింగ్ తదితర మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

సమీక్షలో ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, కమీషనర్ రాహుల్ మీనా తదితర అధికారులు పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా నగరానికి వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి, అందుకు అనుగుణంగా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

పుష్కరాల పనుల్లో భాగంగా రూ.100 కోట్లతో చేపట్టిన 96 పనులను ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు తెలిపారు. ఈ పనుల్లో రహదారుల అభివృద్ధి, ఘాట్ల అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

అదేవిధంగా హెచ్‌ఏఎం (HAM) విధానం కింద రూ.300 కోట్ల పనులు కూడా పుష్కరాల దృష్ట్యా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు.

పుష్కరాలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, అత్యవసర వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.