Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

మధిరకు మరో అదనపు కోర్టు మంజూరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మధిరకు మరో అదనపు కోర్టు మంజూరు
Oplus_16908288

మధిర / ఖమ్మం

మధిర పట్టణానికి మరో అదనపు కోర్టు మంజూరు కావడంపై న్యాయవాదులు, న్యాయ సేవలు పొందే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధిరలో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ అదనపు కోర్టును మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఇందుకు ప్రత్యేకంగా కృషి చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మధిర కోర్టు బిల్డింగ్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది కట్టా పూర్ణచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు.
మధిర ప్రాంతంలో పెరుగుతున్న కేసుల సంఖ్యకు అనుగుణంగా అదనపు కోర్టు అవసరం ఎంతోకాలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తాజాగా కోర్టు మంజూరు కావడంతో న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం కావడంతో పాటు కక్షిదారులకు సత్వర న్యాయం అందే అవకాశం ఉందన్నారు. అలాగే న్యాయవాదులు, కోర్టు సిబ్బందిపై పని భారం కొంత మేర తగ్గుతుందని తెలిపారు. మధిర న్యాయ వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కట్టా పూర్ణచంద్రరావు కోరారు.

మధిరకు మరో అదనపు కోర్టు మంజూరు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *