Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఎడ్ల కోడేరులతో వినూత్న ప్రచారం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎడ్ల కోడేరులతో వినూత్న ప్రచారం!

AIKMS జాతీయ 4వ మహాసభలకు తరలిరావాలని పిలుపు

తిరుమలాయపాలెం, పున్నమి:
అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) జాతీయ 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెంలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఎడ్ల కోడేరులతో విచిత్ర వేషధారణలో గ్రామంలో ప్రదర్శన చేపట్టి మహాసభలపై ప్రజల్లో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మాజీ రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్రప్రసాద్, మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులకు వ్యతిరేకంగా ఉన్న మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో AIKMS మండల అధ్యక్షుడు గొర్రెపాటి వీరస్వామి, కార్యదర్శి అచ్చ ఉప్పలయ్య, నాయకులు పోలేపొంగు నాగయ్య, వెంకటేశ్వర్లు, బ్రహ్మచారి, పట్టాభి, వీరన్న, ఎల్లయ్య, ఐలన్న తదితరులు పాల్గొన్నారు.

ఎడ్ల కోడేరులతో వినూత్న ప్రచారం!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *