Saturday, 26 September 2026
  • Home  
  • మమతా నగర్‌లో ఘనంగా శ్రీ ముద్ర సారీస్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు
- రంగారెడ్డి

మమతా నగర్‌లో ఘనంగా శ్రీ ముద్ర సారీస్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు

నాగోల్: నాగోల్ మమతా నగర్‌లో శ్రీ ముద్ర సారీస్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ గణేష్ స్వామివారి లడ్డూ వేలం పాట భక్తులు, స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపింది. మొదటి లడ్డూను హిమజ రూ.2,16,000లకు దక్కించుకోగా, రెండో లడ్డూను నాగర్ కర్నూల్–మంగళపల్లికి చెందిన రాంరెడ్డి రూ.46,116లకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ముద్ర సారీస్ ఫౌండర్, చైర్మన్ గంగిశెట్టి ఉపేందర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. లడ్డూ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఉత్సవ నిర్వాహకులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ఆద్యంతం భక్తి వాతావరణంలో విజయవంతంగా కొనసాగింది.

నాగోల్: నాగోల్ మమతా నగర్‌లో శ్రీ ముద్ర సారీస్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ గణేష్ స్వామివారి లడ్డూ వేలం పాట భక్తులు, స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపింది. మొదటి లడ్డూను హిమజ రూ.2,16,000లకు దక్కించుకోగా, రెండో లడ్డూను నాగర్ కర్నూల్–మంగళపల్లికి చెందిన రాంరెడ్డి రూ.46,116లకు కైవసం చేసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీ ముద్ర సారీస్ ఫౌండర్, చైర్మన్ గంగిశెట్టి ఉపేందర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. లడ్డూ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

ఉత్సవ నిర్వాహకులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ఆద్యంతం భక్తి వాతావరణంలో విజయవంతంగా కొనసాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.