విశాఖపట్నం జిల్లా, మారికవలస (పున్నమి ప్రతినిధి): సెప్టెంబర్ 25:: మారికవలస ప్రధాన రహదారి పక్కన విద్యుత్, కేబుల్ వైర్లు అస్తవ్యస్తంగా కనిపిస్తున్న పరిస్థితి స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. రహదారి పక్కనే వైర్లు, కేబుల్స్ రక్షణ లేకుండా నేలపై ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
వర్షాకాలంలో వైర్లు తడవడం, వాహనాల రాకపోకల సమయంలో అవి దెబ్బతినడం వంటి పరిస్థితులు ఏర్పడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించాలని కోరుతున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే చర్యలు తీసుకోవడం మంచిదని, సంబంధిత విద్యుత్, కేబుల్ సిబ్బంది ప్రదేశాన్ని పరిశీలించి వైర్లను సక్రమంగా అమర్చి, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.




